

ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ జనవరి నుంచి మార్చి వరకు గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ మెరుగైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ నికర లాభం 20.8 శాతం పెరిగి 8,501 కోట్ల రూపాయలకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో ఈ లాభం 7,033 కోట్ల రూపాయలుగా ఉంది. అలాగే కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13.4 శాతం పెరుగుదలతో 46,402 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ ఆదాయం 40,925 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే ఇన్ఫోసిస్ నికర లాభం 10.20 శాతం వృద్ధితో 29,440 కోట్ల రూపాయలకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 26,713 కోట్ల రూపాయలుగా ఉంది. అదే సమయంలో కార్యకలాపాల ఆదాయం 9.6 శాతం పెరిగి 1,78,650 కోట్ల రూపాయలకు చేరింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతం నుంచి 3.5 శాతం వరకు వృద్ధి సాధ్యమని కంపెనీ అంచనా వేసింది. అలాగే ఈ ఏడాదిలో 20 వేల మంది కొత్త ఉద్యోగులను నియమించనున్నట్లు తెలిపింది. మార్చి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,28,594గా ఉన్నట్లు సమాచారం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!