

కే. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత్ రాష్ట్ర సమితి మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించగా, డీలిమిటేషన్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావుతో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగే విధంగా ఏ నిర్ణయం వచ్చినా అంగీకరించబోమని స్పష్టం చేశారు. మొదటి సారి అధికారంలో ఉన్నప్పుడే అసెంబ్లీలో మహిళా రిజర్వేషన్‌కు మద్దతుగా తీర్మానం చేశామని గుర్తుచేసి, రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఈ బిల్లుకు మద్దతు తెలుపుతారని తెలిపారు.
అయితే డీలిమిటేషన్ బిల్లులోని అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24% సీట్లు ఉన్నాయని, అవి తగ్గకుండా 50% వరకు పెంచాలని అభిప్రాయపడ్డారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు. పూర్తి స్థాయి విశ్లేషణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని పార్టీకి సూచించారు.







.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!