
న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఇంప్రూవ్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సబ్జెక్టుల వారీగా ఉత్తమ మార్కులు (Best Marks) విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పుతో విద్యార్థులు తమ మార్కులను మరింత మెరుగుపరుచుకునే అవకాశం పొందనున్నారు.
ఇంప్రూవ్‌మెంట్‌కు హాజరయ్యే ప్రతి పేపర్‌కు అదనంగా రూ.160 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!