
రాజకీయాలు

యువ నటుడు, ఇన్ఫ్లుయెన్సర్ మౌళి తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు. తాజాగా మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి కొత్త సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘దొంగ నా కొడుకు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్‌బస్టర్ విజయంతో మౌళి వరుస హిట్లతో మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఈ చిత్రానికి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌ను బట్టి ఇది కామెడీ-క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ మౌళిని అడ్వాన్స్ ఇచ్చి సైన్ చేసినట్లు సమాచారం. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. ఈ సినిమా మౌళి కెరీర్‌ను మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!