

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఆభరణాల దుకాణంలో సంచలన దోపిడీ జరిగింది. ‘పోలీసు’ అని రాసి ఉన్న టీషర్టులు, మాస్కులు ధరించిన ఎనిమిది మంది దుండగులు మధ్యాహ్నం నిత్యానందనగర్లోని శ్రీవెంకటేశ్వర జ్యువెలర్స్లోకి ప్రవేశించారు. తుపాకీతో బెదిరించి దుకాణ యజమాని కిల్లంశెట్టి రామకృష్ణారావుకు బేడీలు వేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లాకర్ తాళాలు తీసుకొని అందులోని బంగారు ఆభరణాలతో పాటు వ్యాపారి మెడలో ఉన్న నగలను కూడా దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు.
దుండగులు వెళ్లిన తర్వాత బాధితుడు బేడీలతోనే బయటకు వచ్చి సమీప దుకాణదారులకు సమాచారం అందించాడు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బేడీలను తొలగించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో దాదాపు కిలో బంగారు ఆభరణాలు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!