
సినిమాలు

తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ కీలక నేత కె. అన్నామలై రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకోలేదు. రాష్ట్రంలో పార్టీకి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన ఆయన పేరు జాబితాలో లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల కాలంలో అన్నామలై రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వినిపించాయి. రాజ్యసభ అవకాశాలు, తమిళనాడులో కీలక పాత్ర వంటి వార్తలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం కూడా ఉంది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ ఎన్నికల రంగంలో తగ్గిన చురుకుదనం చర్చకు దారి తీస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!