

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాస్టర్ ప్రణాళికను వివరించారు. ముఖ్యమంత్రి పలు సూచనలు చేస్తూ భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్ర నియమాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
భవిష్యత్ అవసరాలు మరియు రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాలమైన రహదారులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో శుభ్రతను కాపాడేందుకు విద్యుత్ వాహనాలనే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు మెరుగుపడేలా ప్రణాళికలు అమలు చేయాలని చెప్పారు.
ఆలయ పవిత్రతను కాపాడేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల తరహాలో ఆలయ పరిసరాల్లో రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేకుండా నియమాలు ఉండాలని సూచించారు. ఈ నెల 6న ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రెండు వందల ఇరవై ఐదు కోట్లతో ఈ పనులు ప్రారంభం కానున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!