
న్యూస్

అమరావతిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక ప్రాజెక్టుగా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మొత్తం రూ.2,534 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి మాత్రమే రూ.1,299.08 కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనున్నారు.
అమరావతిని కేంద్రంగా చేసుకుని పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బహుళ అంతస్తుల భవనాలను నిర్మించనున్నారు. సుమారు 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్ భవనం నిర్మించబడగా, మరో 17 ఎకరాల్లో నివాస సముదాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో అమరావతి అభివృద్ధికి మరింత ఊతం లభించనుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!