

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నప్పటికీ, విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి తాజాగా ధురంధర్-2 చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఈ చిత్రంపై స్పందిస్తూ దర్శకుడు ఆదిత్య ధర్ను ఎంతో ప్రతిభావంతుడిగా అభివర్ణించారు.
సినిమా గురించి మాట్లాడుతూ, ఇలాంటి అనుభవాన్ని భారత్లో ఇంతకు ముందు చూడలేదని తెలిపారు. ఈ చిత్రం అన్ని రకాల భావోద్వేగాలను ప్రేక్షకులలో రేకెత్తించిందని, దాదాపు నాలుగు గంటల పాటు ఒక్కసారి కూడా దృష్టి మరలకుండా ఆసక్తిగా చూసినట్లు పేర్కొన్నారు. దర్శకుడి ప్రతిభ, నిబద్ధత ఈ చిత్రంలో ప్రతిబింబించిందని కొనియాడారు. నటీనటులందరూ అద్భుతంగా నటించినప్పటికీ, రణ్వీర్ సింగ్ ఈ సినిమాతో మరింత ఉన్నత స్థాయికి చేరుకున్నారని, ఆయన నటన అత్యుత్తమమని విరాట్ కోహ్లీ తన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!