

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న అడివి శేష్ నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. టీజర్, ట్రైలర్, పాటలతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ముందు నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని గ్రాండ్‌గా మార్చారు.
ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ డెకాయిట్ ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సుప్రియ నిర్మించిన ఈ సినిమా పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, టీమ్ ప్యాషన్‌తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించిందని ప్రశంసించారు. అడివి శేష్ నటనపై తనకు మొదటినుంచి నమ్మకం ఉందని, అతను చేసిన ప్రతి సినిమా విజయవంతమైందని తెలిపారు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే మృణాల్ ఠాకూర్‌కు ఇది కెరీర్‌లో మరో ముఖ్యమైన సినిమా అవుతుందని అన్నారు. ఈ తరహా కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు.
హీరో అడివి శేష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, సిద్ధు జొన్నలగడ్డ, సుమంత్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ సహా పలువురు చిత్రబృందం సభ్యులు ఈ ఈవెంట్‌లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. డైరెక్టర్ శానియల్ డియో అహర్నిశలు కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారని శేష్ తెలిపారు. ఈ సినిమా పూర్తిగా తమ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ప్రేక్షకులు తమ పాషన్‌ను ఈ సినిమాలో చూడగలరని చెప్పారు. మృణాల్ తన పాత్ర సరస్వతిగా కెరీర్‌లో గుర్తుండిపోయేలా ఉంటుందని చెప్పగా, నిర్మాత సుప్రియ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్యాషన్‌తో రూపొందించినట్లు వివరించారు. మొత్తం టీమ్ ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ప్రేక్షకుల ఆదరణ కోరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!