

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'లోని స్పెషల్ సాంగ్ చుట్టూ సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సాంగ్ లో చరణ్ తో స్టెప్పులు వెయ్యడానికి మృణాల్ ఠాకూర్ పేరు ముందుండగా, తాజాగా పూజా హెగ్డే మరియు ఆయేషా ఖాన్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
అయితే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ తప్పితే ఇంకెవరూ తమకు వద్దని, ఆమెతోనే ఈ సాంగ్ షూట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి కొందరు జాన్వీ కపూర్‌తో కలిసి మృణాల్ సాంగ్ చేయాలని కూడా సూచిస్తున్నారు. ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేస్తున్న ఈ సాంగ్ భారీ మాస్ యాంథమ్‌గా తయారవుతుందని టాక్.
ప్రస్తుతం పెద్ది షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది.ఈ స్పెషల్ సాంగ్ విషయంలో త్వరలో క్లారిటీ రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఈ సాంగ్ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!