

ప్రముఖ సినీ విశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ చిత్ర లక్ష్మణన్ తన ‘టూరింగ్ టాకీస్’ ఛానెల్లో చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి. త్రిష ఇకపై సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారని, కొందరు నిర్మాతలు ఈ విషయాన్ని తనకు వెల్లడించారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష స్పందిస్తూ తీవ్రంగా ఖండించారు. “అవును, నేను సినిమాలు మానేసి ఒక పెద్ద వ్యాపారవేత్తను వివాహం చేసుకుని నలుగురు పిల్లలను కన్నాను. మీ ఊహలకు ఈ సమాధానం సరిపోతుందా? లేక వార్తలు రావడానికి ఇది సరిపోతుందా? ఇంకా ఏమైనా కావాలా?” అంటూ ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ఇక దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా కొనసాగుతున్న త్రిష కృష్ణన్ గురించి ఇటీవల రిటైర్మెంట్ పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి త్వరలో ముగింపు పలకబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!