
రాజకీయాలు

అంబేద్కర్ ఆలోచనలు మరియు విధానాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రక్తం చిందించకుండా కూడా దేశాన్ని గెలవొచ్చని మహాత్మా గాంధీ ప్రపంచానికి చాటారని ఆయన గుర్తు చేశారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించి అభివృద్ధి సాధించవచ్చని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు. దేశానికి గాంధీ, అంబేద్కర్ ఇద్దరూ రెండు కళ్ల వంటివారని వ్యాఖ్యానించారు.
అంబేద్కర్ ఆలోచనే తమ ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితోనే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని ఆయన అన్నారు.

















.webp&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!