

ఈరోజు న్యూఢిల్లీ లో నిర్వహించిన న్యాయ ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ, డిజిటల్ మార్పుల జాతీయ సదస్సులో సుప్రీం కోర్టు సి జే సూర్యకాంత్ మాట్లాడుతూ టెక్నాలజీ ఇక పరిపాలనా సౌలభ్యం మాత్రమే కాకుండా రాజ్యాంగ సాధనంగా మారిందని తెలిపారు. చట్టం ముందు సమానత్వాన్ని బలపరచడంలో, న్యాయానికి అందుబాటును విస్తరించడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సమాజం మారుతున్న కొద్దీ న్యాయవ్యవస్థ కూడా టెక్నాలజీతో పాటు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ₹7210 కోట్ల వ్యయంతో ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్ మూడో దశను ప్రారంభించారు. సుప్రీం కోర్టు ఈ-కమిటీ, న్యాయశాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ రెండురోజుల సదస్సులో న్యాయ సేవలను మరింత సులభం, సమగ్రం, అందుబాటులోకి తీసుకురావడంపై చర్చలు జరిగాయి. ఈ-ఫైలింగ్, రికార్డుల డిజిటైజేషన్, హైబ్రిడ్ హియరింగ్స్ వంటి చర్యలు న్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో కీలకంగా మారుతున్నాయని అధికారులు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!