

కొబ్బరి నీటిలో సుమారు 95 శాతం నీటితో పాటు పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండి శరీరానికి తక్షణ హైడ్రేషన్ అందిస్తాయి. చెమట ద్వారా కోల్పోయిన ద్రవాలను భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుంది. అయితే దీనిని అతిగా తాగడం వల్ల రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగి హైపర్కలేమియా అనే ప్రమాదకర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల కండరాల బలహీనత, గుండె స్పందనలో అసమానతలు ఏర్పడి తీవ్ర స్థాయిలో గుండె సమస్యలకు దారితీయవచ్చు. అలాగే ఇందులోని కొన్ని కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకుంటే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపి విరేచనాలు, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు కలుగుతాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యత దెబ్బతినడం వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా రక్తపోటు మందులు తీసుకునే వారిలో ఇది రక్తపోటును అకస్మాత్తుగా తగ్గించే ప్రమాదం ఉంది.
అందుకే కొబ్బరి నీటిని మితంగా తీసుకోవడం అత్యంత అవసరం. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు అదనపు పొటాషియాన్ని బయటకు పంపలేక ప్రమాదం పెరుగుతుంది. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిది. తీవ్రమైన డీహైడ్రేషన్ పరిస్థితుల్లో కొబ్బరి నీటిపై మాత్రమే ఆధారపడకుండా తగిన చికిత్స తీసుకోవాలి. సాధారణంగా ఆరోగ్యవంతులు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులు మాత్రమే తీసుకోవడం సురక్షితం. ఎండలో తిరిగినప్పుడు లేదా వ్యాయామం చేసిన తర్వాత అలసటను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుంది. అయితే తక్కువ సమయంలో ఎక్కువగా తాగకుండా, వ్యక్తిగత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మోతాదును నియంత్రించడం ద్వారా కొబ్బరి నీటి ప్రయోజనాలను సురక్షితంగా పొందవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.



.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!