

కోడిగుడ్డు ధరలు ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా భారీగా పెరిగిపోయాయి. సాధారణ ప్రజల ప్రోటీన్ ఆహారమైన గుడ్డు ఇప్పుడు అందని ద్రాక్షలా మారింది. ఒకప్పుడు రిటైల్ మార్కెట్లో రూ.5–6 కు దొరికే గుడ్డు, ప్రస్తుతం రూ.8కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కూడా ఒక్క గుడ్డు ధర రూ.7.30 పైగా ఉండటం ఈ పెరుగుదల తీవ్రతను చూపిస్తోంది.
కొద్ది రోజుల క్రితం 30 గుడ్ల ట్రే ధర రూ.160–170 ఉండగా, ఇప్పుడు హోల్‌సేల్‌లోనే రూ.210–220 కు ఎగబాకింది. నాటు కోడిగుడ్డు అయితే ఒక్కోటి రూ.15 కు అమ్ముతున్నారు. డిమాండ్‌కు సరిపడ ఉత్పత్తి లేకపోవడమే ప్రధాన కారణమని పౌల్ట్రీ పరిశ్రమ చెబుతోంది. దాణా, మక్కజొన్న, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు పెరగడం వల్ల చాలా మంది కోళ్ల రైతులు ఫారాలు మూసివేయడం పరిస్థితిని మరింత కష్టతరం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో రోజుకు సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి ఉండేది. కాని ఇటీవల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. "హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8-ఇది పౌల్ట్రీ చరిత్రలోనే అత్యధిక ధర. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది" అని వ్యాపారులు చెబుతున్నారు. ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థాయికి రావడం వరకు ధరలు తగ్గే అవకాశం లేదని నిపుణులు సూచిస్తున్నారు.

.jpg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!