
సినిమాలు

యునైటెడ్ కింగ్డమ్లో భారతీయులు, పాకిస్థానీయులు స్థానికుల ఉద్యోగాలను దక్కించుకుంటున్నారంటూ బ్రిటీష్ పార్లమెంట్ సభ్యుడు రూపెర్ట్ లోవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. వలసదారుల అంశంపై స్పందించిన ఆయన, "నన్ను జాత్యహంకారి అని పిలిచినా పర్వాలేదు, నేను నిజాలే మాట్లాడతాను" అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి.
రూపెర్ట్ లోవ్ ఇటీవల 'రిఫార్మ్ యూకే' పార్టీ నుంచి విడిపోయి 'రిస్టోర్ బ్రిటన్' పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ఆయన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండగా, వలసదారుల పాత్రను తప్పుగా చిత్రీకరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి వలస విధానాలపై చర్చను తెరపైకి తీసుకొచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!