
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆధార్ కార్డును వినియోగిస్తుండగా, త్వరలో ప్రత్యేక మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కార్డుల ద్వారా ప్రయాణ వివరాల నమోదుతో పాటు సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఈ స్మార్ట్ కార్డులను అధికారికంగా ప్రారంభించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు, ఉద్యోగులకు అందిస్తున్న సీజన్ పాస్‌ల తరహాలోనే మహిళలకు కూడా ఈ కార్డులు జారీ చేయనున్నారు. దీంతో మహాలక్ష్మి పథకం అమలు మరింత సులభతరం కావడంతో పాటు ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు అందే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!