
గాసిప్స్

బైక్ నడిపేటప్పుడు ఫోన్ ఉపయోగించడం ప్రమాదకరమని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా కొందరు మాత్రం పట్టించుకోవడం లేదు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో జరిగిన ఈ ఘటన అలాంటి నిర్లక్ష్యానికి ఉదాహరణగా నిలిచింది.
బెంజ్ సర్కిల్ నుంచి మహానాడు కూడలి వైపు జాతీయ రహదారిపై స్కూటీపై వెళ్తున్న యువతిని ట్రాఫిక్ పోలీసులు ఆగమని సంకేతం ఇచ్చారు. ఆమె గమనించినప్పటికీ ఒక చేతిలో ఫోన్ ఉండడంతో వాహనాన్ని నియంత్రించలేకపోయింది. ఫలితంగా ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని కింద పడిపోయింది. తలకు హెల్మెట్ లేకపోయినా ఆ సమయంలో భారీ వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.













.jpg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!