

ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ ను ప్రముఖ పారిశ్రామికవేత్తలు లక్ష్మీ మిత్తల్, ఆదిత్య మిత్తల్, అదార్ పూనావాలా ఆధ్వర్యంలోని కన్సార్టియం రూ.15,600 కోట్లకు కొనుగోలు చేసింది. నిధులు సమీకరించలేక సోమాని కన్సార్టియం పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ డీల్ ఖరారైంది. ఈ ఒప్పందంలో రాజస్థాన్ రాయల్స్‌తో పాటు పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ కూడా ఉన్నాయి. మిత్తల్ కుటుంబానికి 75%, పూనావాలాకు 18%, మిగతా వాటా మనోజ్ బదాలే తదితర ఇన్వెస్టర్లకు ఉంది.
ఈ డీల్ మూడో త్రైమాసికానికి పూర్తవనుండగా, భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతులు అవసరం. లక్ష్మీ మిత్తల్ క్రికెట్‌పై తనకున్న ప్రేమను వ్యక్తం చేయగా, ఆదిత్య మిత్తల్ యువ ప్రతిభను ప్రోత్సహించే ఆర్‌ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తామని తెలిపారు. అదార్ పూనావాలా భాగస్వామ్యంపై సంతోషం వ్యక్తం చేస్తూ దీర్ఘకాలిక విజయానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!