
క్రీడలు

రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా, ఆమ్ ఆద్మీ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీని విడిచిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని పంజాబ్‌లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. అవినీతి, రాజీ రాజకీయాల వల్లే పార్టీని వీడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భాజపాలో చేరిన ఎంపీలపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నంలో భాగంగా సందీప్ పాఠక్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఆరోపించారు.
ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 5న సమావేశం కానున్నట్లు తెలిపారు. మరోవైపు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పార్టీని విడిచిన ఎంపీల విషయాన్ని రాష్ట్రపతికి తెలియజేస్తామని చెప్పారు. ఈ పరిణామాలు పంజాబ్ రాజకీయాల్లో ఉద్రిక్తతను పెంచుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!