
క్రీడలు

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. అంగ్‌క్రిష్ రఘువంశీ (59) అర్ధశతకంతో మెరిసగా, అజింక్య రహానే (43) కీలక పాత్ర పోషించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్‌హెచ్ 165 పరుగులకు ఆలౌట్ అయింది. ట్రావిస్ హెడ్ (61), ఇషాన్ కిషన్ (42) రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, సునీల్ నరైన్ 2 వికెట్లు సాధించి జట్టును విజయపథంలో నడిపించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!