
క్రీడలు

కరీంనగర్ లోని PMJ జువెలరీ షాపులో జరిగిన కాల్పులు, దోపిడీ ఘటనలో నిందితుల ఆచూకీ తెలిపిన వారికి రూ.1,00,000 బహుమతి ప్రకటించారు. ఈ ఘటనలో నిందితులు కాల్పులు జరిపి దుకాణాన్ని దోచుకుని పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఐదుగురు నిందితుల ముఖచిత్రాలను పోలీసులు విడుదల చేశారు.
నిందితులు అంతర్రాష్ట్ర ముఠాకు చెందినవారని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరైనా సమాచారం ఉంటే 8712670762, 8712670711, 8712670713 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!