
క్రీడలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి పోటీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ చివరి ఓవర్‌లో ఒక బంతి మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. సాయి సుదర్శన్ 57 పరుగులతో రాణించగా, వాషింగ్టన్ సుందర్ 23 బంతుల్లో అజేయంగా 40 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. జోస్ బట్లర్ (26), నిశాంత్ సింధు (15) కూడా సహకరించారు. గుజరాత్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా, పంజాబ్‌కు రెండో ఓటమి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!