
క్రీడలు

కేరళ, అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ సంబరాలకు సిద్ధమవుతున్నాయి. కేరళలో యూడీఎఫ్, బీజేపీ శ్రేణులు భారీ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మలప్పురం జిల్లాలో యూడీఎఫ్ కార్యకర్తలు 5,000 మందికి బిర్యానీ విందు ఏర్పాటు చేయగా, కొచ్చిలో బీజేపీ నేతలు లడ్డూలను సిద్ధం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కు ఎదురుగాలి ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి. యూడీఎఫ్‌కు ఆధిక్యం, బీజేపీ ఖాతా తెరవొచ్చని విశ్లేషణలు సూచిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!