
జనరల్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో జరిగిన సమావేశంలో పీఆర్సీ నివేదికను తక్షణమే అందించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అలాగే వచ్చే 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ₹6 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఉద్యోగ సంఘాలతో ప్రతి రెండు నెలలకు ఒకసారి సమావేశమై సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆరోగ్య భద్రత కార్డులు, సమయానికి వేతనాలు, బదిలీలు, నియామకాలు వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రభుత్వ స్పందనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలను ఉపసంహరించుకున్నాయి.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!