
క్రీడలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎయిమ్స్ బీబీనగర్ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లోనే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నదని తెలిపారు. కేవలం ₹10తో ఓపీ సేవలు, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, మల్టీ స్పెషాలిటీ సేవలతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు.
కార్పొరేట్ వైద్యం ధనికులకు మాత్రమే అన్న భావనను ఎయిమ్స్ బీబీనగర్ చెదరగొట్టిందని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ బలోపేతం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసం పెరిగిందన్నారు. ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందేందుకు ముందుకు వస్తున్నారని వెల్లడించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!