
క్రీడలు

రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పంజాబ్ ప్రభుత్వంపై రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలవనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరగా, ఈ నెల 5న సమయం కేటాయించారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడిన ఎంపీలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర యంత్రాంగం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.
పార్టీ మారిన తర్వాత ఎంపీ సందీప్ పాఠక్ పై పంజాబ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వివాదాస్పదమైంది. నాన్‌బెయిలబుల్ కేసుల కారణంగా అరెస్ట్ అవుతారనే వార్తలు వినిపించాయి. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించడం, ఢిల్లీలోని ఇంటి వెనుక భాగం నుంచి ఆయన వెళ్లిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలో చేరిన ఎంపీలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రాఘవ్ చద్దా ఆరోపించారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!