

చైనాలోని ఓ స్కూలులో నోరో వైరస్ కలకలం రేగింది. వంద మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురికావడంతో వైద్యాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నిర్వహించిన పరీక్షల్లో 103 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు స్కూల్ క్లాస్‌రూమ్‌లు, ఆవరణలో వైరస్‌ను నిర్మూలించే మందులను పిచికారీ చేశారు. బాధిత విద్యార్థులకు చికిత్స అందిస్తూ, మిగతా విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు.
అధికారుల వివరాల ప్రకారం, బాధితులంతా కోలుకుంటుండగా రోజువారీగా వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా వైరస్ పరీక్షలు నిర్వహించారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ డిసీజ్ కంట్రోల్ అధికారులు తెలిపినట్లు, అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలంలో నోరో వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వాంతులు, విరేచనాలకు కారణమవుతుందని, వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగిందని తెలిపారు. 1968 లో అమెరికాలో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది మంది ప్రభావితమవుతున్నారని గణాంకాలు సూచిస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!