

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన టొవినో థామస్ నటించిన “పళ్లిచట్టంబి” సినిమా ఈనెల 17 న తెలుగులో గ్రాండ్గా విడుదలకు సిద్ధమైంది. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని నిర్మాతలు చాణక్య, చైతన్య, చరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో చిత్రబృందం తమ ప్రయాణాన్ని వివరించింది. ఈ సినిమా కోసం సుమారు 2000 మంది 130 రోజుల పాటు కష్టపడ్డారని తెలిపారు. అసోసియేట్ నిర్మాత మేఘ శ్యామ్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కథ ప్రేక్షకులకు దగ్గరగా అనిపించే విధంగా ఉండటమే విజయానికి కారణమన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!