
క్రీడలు
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో ‘కృష్ణావతారం’ చిత్రం ట్రైలర్‌ను వేలాది భక్తుల సమక్షంలో వైభవంగా విడుదల చేశారు. శ్రీకృష్ణుడుకు సంబంధించిన ఈ పౌరాణిక చిత్రంపై ట్రైలర్ విడుదలతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా విజువల్ వండర్‌గా రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
హార్దిక్ గజ్జర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ గుప్తా శ్రీకృష్ణుడి పాత్రలో నటిస్తుండగా, సుష్మిత భట్ రాధగా, సంస్కృతి జయాన్ సత్యభామగా, నివాషిని కృష్ణన్ రుక్మిణిగా కనిపించనున్నారు. క్రియేటివ్ ల్యాండ్ స్టూడియోస్, అథశ్రీకథ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం ‘ది హార్ట్ (హృదయం)’ వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయనంక బోస్ కెమెరా, ప్రకాష్ కపాడియా కథ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!