

కన్నడ స్టార్ యశ్ నటిస్తున్న ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదలపై సోషల్ మీడియాలో వచ్చిన వాయిదా వార్తలను మేకర్స్ ఖండించారు. మొదట మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా మిడిల్ ఈస్ట్ పరిస్థితుల కారణంగా జూన్ 4కి వాయిదా పడింది. మళ్లీ వాయిదా అవుతుందని వచ్చిన వార్తల్లో నిజం లేదని, జూన్ 4నే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు.
చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధం చేసింది. యశ్, నిర్మాత నమిత్ మల్హోత్రా లాస్ వెగాస్‌లోని సినిమాకాన్‌కు వెళ్లి, ‘టాక్సిక్’తో పాటు ‘రామాయణం’ గురించి అంతర్జాతీయ స్థాయిలో చర్చిస్తారట. టీజర్ ఇప్పటికే గ్రాండియర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి వంటి స్టార్లు నటిస్తున్నారు. కన్నడ, ఇంగ్లీష్‌లో చిత్రీకరించి, తెలుగు సహా అన్ని భాషల్లో డబ్ చేస్తున్నారు.ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వనుంది. యశ్ డ్యూయల్ రోల్‌లో అదరగొట్టనున్నాడు. జూన్ 4 థియేటర్లలో పండగ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.











.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!