
బిజినెస్

బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹810 పెరిగి ₹1,55,780కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹750 పెరిగి ₹1,42,800కు చేరింది. పసిడి ధరలు వరుసగా పెరుగుతుండటం కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తోంది.
వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. కిలో వెండి ధర ₹5,000 పెరిగి ₹2,80,000కు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్ ప్రభావం, ద్రవ్యోల్బణం, భద్ర పెట్టుబడులపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఈ ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!