

సినిమా ప్రేమికులకు హైకోర్టు మంచి వార్త తెలిపింది. సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజును రద్దు చేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 121ను కోర్టు సస్పెండ్ చేసింది. మల్టీప్లెక్స్‌లలో ఉన్నట్లే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ప్రేక్షకులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలని హైకోర్టు సూచించింది. దీంతో ఇకపై సినిమా చూడడానికి థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులు రూ.20 పార్కింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
సాధారణంగా మాల్స్ మరియు మల్టీప్లెక్స్‌లలో కస్టమర్లకు ఉచిత పార్కింగ్ అందిస్తారు. అయితే 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని ఆశ్రయించి పార్కింగ్ ఫీజు వసూల్ చేసుకునే అనుమతి కోరాయి. దీనికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీవో నెంబర్ 121 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.20 వరకు పార్కింగ్ ఫీజు వసూల్ చేసే అవకాశం కల్పించారు.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఒక యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూల్ చేయడం సరైంది కాదని పేర్కొంటూ జీవోను రద్దు చేసింది. దీంతో ఇకపై అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కూడా ప్రేక్షకులకు ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.
.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!