
క్రీడలు

హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల జీతాల్లో వచ్చే ఆరు నెలల పాటు 30 శాతం కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగులకు ఈ జీతాల కోత నుంచి మినహాయింపు ఇచ్చింది.
అప్పుల భారం పెరగడం, ఖజానా ఖాళీగా మారడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కేంద్రం నుంచి నిధులు తగ్గడం, అలాగే పాత పెన్షన్ విధానం (OPS) అమలు కారణంగా ఆర్థిక ఒత్తిడి పెరిగిందని పేర్కొంది. ఈ నిర్ణయంతో జీతాల కోత లేదా వాయిదా విధానాన్ని తీసుకున్న తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!