
క్రీడలు

తమిళ, తెలుగు సినీ పరిశ్రమల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఆర్య తాజాగా చేసిన వ్యాఖ్యలతో వివాదంలో నిలిచారు. తన తాజా చిత్రం మిస్టర్ ఎక్స్ ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, గతంలో వారణాసిలో గడిపిన అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా నాన్ కడవుల్ సినిమా షూటింగ్ సమయంలో అక్కడి జీవన విధానం గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వారణాసిలో ఉన్న సాధువులలో చాలామంది నిజమైనవారే అయినప్పటికీ, కొందరు నకిలీగా ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. కొంతమంది నేరాల నుంచి తప్పించుకోవడానికి ఆ వేషంలో తిరుగుతారని, వారి వద్ద గుర్తింపు పత్రాలు కూడా ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!