
న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు మరియు అధికారుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాలని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల సమయం ఇవ్వాలని కమిటీ చేసిన ప్రతిపాదనను జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతో కాలయాపన జరుగుతోందని జేఏసీ ఆరోపించింది. గత్యంతరం లేకనే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు.
మా సమస్యలు కొత్తవేం కావని, అవి గతం నుంచే కొనసాగుతున్నవని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలే తాము కోరుతున్నామని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ఆయన అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!