
క్రీడలు

యువ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో విండీస్‌తో సిరీస్‌తో పాటు ఏషియన్ గేమ్స్ కూడా జరగనున్న నేపథ్యంలో, ఒకేసారి రెండు టీ20 జట్లను సిద్ధం చేయాలని యోచిస్తోంది. మొత్తం 30 నుంచి 35 మంది ఆటగాళ్లతో రెండు విభిన్న T20 స్క్వాడ్‌లను రూపొందించే అవకాశముందని తెలుస్తోంది.
ఈ జట్లలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పించనున్నారు. వైభవ్, యశస్వి జైస్వాల్, ప్రియాంశ్, రఘువంశీ, రజత్ పటిదార్, బదోని, శశాంక్ సింగ్, జితేశ్ శర్మ, అనుకుల్ రాయ్, అశోక్ శర్మ, త్యాగి తదితరులకు అవకాశం దక్కవచ్చని సమాచారం. ఈ రెండు జట్లకు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!