

రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భాగ్యనగరంలోని వివిధ స్టేషన్ల నుంచి మొత్తం 8 కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ కొత్త వీక్లీ స్పెషల్ ట్రైన్లు ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు పుణ్యక్షేత్రాలు మరియు దూరప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగుపరచనున్నాయి.
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో ఈ కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు, శ్రీ గంగానగర్, జైపూర్, భువనేశ్వర్ వంటి గమ్యస్థానాలకు నేరుగా రైళ్లు నడపాలనే డిమాండ్లపై ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు. ఈ నేపథ్యంలో కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి కొత్త సర్వీసులను ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందులో తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు 5 రైళ్లు, అలాగే భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి దూరప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఉండనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!