
గాసిప్స్

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఎలాంటి ఇంధన కొరత లేదని స్పష్టం చేస్తూ, నిన్న సాధారణంగా ఉన్న సరఫరా కంటే 54 శాతం ఎక్కువగా సరఫరా చేసినట్లు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లో మొత్తం 596 ఫ్యూయల్ ఔట్‌లెట్లు ఉన్నాయని, ప్రజలకు సరిపడా సరఫరా అందుబాటులో ఉందని చెప్పారు. ఎల్పీజీ విషయంలో ఒకే రోజు 2.80 లక్షల సిలిండర్లు బుక్ చేయబడినట్లు తెలిపారు. డిమాండ్ కంటే ఎక్కువగా సరఫరా చేస్తున్నప్పటికీ, ప్రజలు అధికంగా బుకింగ్‌లు చేయడం వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.














.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!