
న్యూస్

టాలీవుడ్‌లో ఒక్క హిట్ పడితే చాలు కెరీర్ మలుపు తిరుగుతుందని అంటారు. అదే విషయం దర్శకుడు సాయిలు కంపాటి విషయంలో నిజమైంది. రాజు వెడ్స్ రాంబాయి చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, మొదటి సినిమాతోనే ప్రామిసింగ్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఈ విజయంతో ఆయనకు కొత్త అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పుడు సాయిలు కంపాటి ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌లో తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఏషియన్ సునీల్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ వంటి అగ్ర నిర్మాతలు ఆయన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల రేవంత్ రెడ్డిచేతుల మీదుగా గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం ఈ చిత్రానికి మరింత గుర్తింపు తీసుకువచ్చింది. పెద్ద బ్యానర్, అగ్ర నిర్మాతల మద్దతుతో సాయిలు కెరీర్ ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగడం ఖాయం.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!