

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన తాజా చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు విజయానంతరం తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాడు. ఇప్పటికే వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఉప్పెన ఫేమ్ కృతి శెట్టిని కళ్యాణ్ రామ్ సరసన ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ముఖ్యంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వెంకటేష్ కు జోడీగా నేషనల్ అవార్డు విన్నర్ కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ కాస్టింగ్‌పై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. అనిల్ రావిపూడి కామెడీ స్టైల్‌తో కూడిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

















.png&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!