
సినిమాలు

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్ మరియు ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవదహనం కావడం తీవ్ర విషాదాన్ని కలిగించింది.
గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయం గురించి ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మల్ నుండి నెల్లూరుకు వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!