

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'పుష్ప' ఫ్రాంచైజీతో ఆయన పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు పొందారు. ఇప్పుడు తన తదుపరి సినిమాలను గ్లోబల్ స్థాయిలో చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ప్రస్తుతం బన్నీ, స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ రేంజ్ సైన్స్ ఫిక్షన్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి.
ఇక బాలీవుడ్లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమా సంచలనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో దేశభక్తి భావనను స్టైలిష్‌గా చూపించారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. అలాగే షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా ఓపెనింగ్ వీకెండ్ రికార్డును కూడా ఈ చిత్రం దాటేసింది.
ఈ సినిమాను చూసిన తర్వాత అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఇచ్చిన రివ్యూ వైరల్ అయ్యింది. “Patriotism with swag... ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా” అంటూ ఆయన ప్రశంసించారు. రణవీర్ సింగ్ నటనను మెచ్చుకోవడంతో పాటు దర్శకుడు ఆదిత్య ధర్‌ను కూడా అభినందించారు. ఈ ట్వీట్ తర్వాత అల్లు అర్జున్ – ఆదిత్య ధర్ కాంబినేషన్‌పై ఉన్న రూమర్లు మరింత బలపడ్డాయి. గతంలో ‘అశ్వద్ధామ’ అనే ప్రాజెక్ట్ కోసం ఇద్దరూ చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అలాగే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే ఈ సినిమా పాన్ ఇండియా మాత్రమే కాదు, పాన్ వరల్డ్ స్థాయిలో భారీ సెన్సేషన్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.














.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!