

దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) కీలక సూచనలు జారీ చేసింది. కస్టమర్లకు ఇచ్చే బిల్లుల్లో LPG లేదా ఇతర ఇంధన ఖర్చుల పేరుతో అదనపు ఛార్జీలు వేయడం పూర్తిగా తప్పుడు విధానమని స్పష్టం చేసింది. ఇలాంటి అనవసర ఖర్చులను బిల్లుల్లో చూపించి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని CCPA హెచ్చరించింది. వ్యాపార సంస్థలు పారదర్శకంగా వ్యవహరించాలని, వినియోగదారులను మోసం చేసే విధానాలను వెంటనే ఆపాలని ఆదేశించింది.
ఏదైనా హోటల్ లేదా రెస్టారెంట్ ఇలా అదనపు ఛార్జీలు వేస్తే, కస్టమర్లు వెంటనే 1915 హెల్ప్లైన్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేటప్పుడు సంబంధిత బిల్ కాపీని సాక్ష్యంగా ఉంచుకోవడం తప్పనిసరి అని సూచించింది.
వినియోగదారుల హక్కులను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.


















.png&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!