
క్రీడలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని ప్రాంతంలో తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలపై లోతైన విచారణ జరపాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే మూడు ఘటనల్లో వివిధ కాంట్రాక్టు సంస్థలకు చెందిన నిర్మాణ సామాగ్రి దగ్ధమైంది.
రాయపూడిలో జరిగిన తాజా అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రమాదంపై ప్రాథమిక వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా కారణాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.







.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!