
న్యూస్
.jpg&w=3840&q=75)
దురందర్ 2 సినిమాలోని పాత్రను కించపరిచేలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై దర్శకుడు ఆదిత్య ధర్ తీవ్రంగా స్పందించారు. ‘జస్కీరత్’ అనే సిక్కు పాత్ర తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న చిత్రం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించిన నకిలీ ఫోటో అని ఆయన స్పష్టం చేశారు. తమ సినిమా లేదా అధికారిక ప్రమోషన్లలో అలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవని తెలిపారు.
సిక్కు సమాజంపై తమకు అపార గౌరవం ఉందని పేర్కొన్న ఆదిత్య ధర్, ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించేందుకు ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు వైరల్ చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!