
గాసిప్స్

విజయవాడలో ఇంధన డీలర్లు హెచ్పీసీఎల్ (HPCL)పై తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్వాన్స్ పేమెంట్ చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా లోడ్స్ ఇవ్వకుండా ఒకటి రెండు రోజుల పాటు ఆలస్యం చేస్తున్నారని పెట్రో డీలర్స్ ఫెడరేషన్ తెలిపింది. డీలర్లు తమ సొంత ట్యాంకర్లు పంపినా, టెర్మినల్స్ వద్ద లోడ్ చేయకుండా తిరిగి పంపుతున్నారని ఆరోపించారు.
అదనంగా, HPCL ఫీల్డ్ అధికారులు ప్రీమియం ఇంధనం “పవర్” కొనాలని డీలర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, లేకపోతే సాధారణ ఇంధన సరఫరాను ఆపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాలపై డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ, సముచిత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







.png&w=3840&q=75)

.webp&w=3840&q=75)




.jpg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!