
న్యూస్

బీసీసీఐ భారత్ పురుషుల క్రికెట్ జట్టుకు సంబంధించిన 2026–27 హోం సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సీజన్ వైట్ బాల్ మ్యాచ్‌లతో ప్రారంభమై, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో ముగియనుంది. మొత్తం 17 నగరాల్లో 22 అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించనుండగా, ఈసారి కోల్‌కతా, ముంబైలో టెస్ట్ మ్యాచ్‌లు లేవు. హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ సీజన్‌లో వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు, శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు, జింబాబ్వేతో 3 వన్డేలు జరుగనున్నాయి. ప్రధాన ఆకర్షణగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఉండనుంది. ఈ షెడ్యూల్ విడుదలతో క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!