
గాసిప్స్

ఏప్రిల్ 1 నుంచి జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ నిర్ణయించింది. ఇకపై వాహనదారులు టోల్ చార్జీలను తప్పనిసరిగా ఫాస్టాగ్ లేదా యూపీఐ డిజిటల్ విధానాల ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణం మరింత సులభంగా సాగనుందని అధికారులు భావిస్తున్నారు.
డిజిటల్ చెల్లింపుల ద్వారా ‘నో క్యాష్ – నో స్టాప్’ విధానాన్ని అమలు చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 టోల్ ప్లాజాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేసి పరీక్షిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి సంబంధించి ఇంకా అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!